Natyam ad

మాజీ మంత్రి కేటీఆర్   ఆవిష్కరించిన “సముద్రుడు” టిజర్

హైదరాబాద్ ముచ్చట్లు:


కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సముద్రుడు”. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి   కేటీఆర్ నేడు చిత్ర టీజర్  రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నగేష్ నారాదాసి మాట్లాడుతూ “మత్యకారుల  జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది.మా చిత్రంలో పెద్ద ఆర్టిస్టులు అందరూ  నటించారు.  ఈ రోజు మా చిత్ర టీజర్ ను తెలంగాణ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారు , తన చేతుల మీదుగా అవిష్కరించి , ఒక సోషియో ఎలిమెంట్ ని కమర్షియల్ గా మలిచి సినిమా రూపొందించడం అభినందనీయమని అనడం సంతోషం  గా ఉంది.అలాగే మా సినిమా  మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది . తెలుగు ప్రేక్షకులందరు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.అని అన్నారు      .

 

 

 

హీరో రమాకాంత్ మాట్లాడుతూ “మా సముద్రుడు చిత్ర టీజర్ ను కేటీఆర్  రిలీజ్ చేయడం సంతోషం గా వుంది.  ఈ సందర్భo గా  కేటీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు  తెలియజేస్తున్నాను .అన్ని కమర్షియల్ హంగులతో మా చిత్రాన్ని మే నెల 3వ తేదీన రిలీజ్ చేస్తున్నాం . అందరు చూసి మమ్మలని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను”అని అన్నారు.
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ, సుమన్, శ్రవణ్, రామరాజు, రాజ్ ప్రేమి, సమ్మెట గాంధీ, ప్రభావతి, జబర్దస్త్ శేష్, చిత్రం శ్రీను తదతరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, ఎడిటర్: నందమూరి హరి, కొరియో గ్రఫి: అనీష్, శ్యామ్, పి ఆర్ ఓ: బి. వీరబాబు, ప్రొడ్యూసర్స్: బదావత్ కిషన్, కో  ప్రొడ్యూసర్స్:శ్రీ రామోజు జ్ఞానేశ్వరరావు, సోములు, కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం: నగేష్ నారదాసి

 

Post Midle

Tags: “Samudurudu” teaser unveiled by former minister KTR

Post Midle