జాతరలో దుకాణాలను తోలగించాలి-మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలి
ఎమ్మిగనూరు ముచ్చట్లు:
పట్టణంలో న్యూడెమోక్రసీ కార్యాలయం నందు కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహేంద్ర బాబు మాట్లాడుతూప్రస్తుతం కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు అమలు చేయడం అధికారులకు, ప్రజలకు తెలిసిన విషయమే.. అయితే నిబంధనలు సక్రమంగా అమలు చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎమ్మిగనూరు పట్టణంలో ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోక పోవడం దుర్మార్గమైన విషయం అని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ ఎమ్మిగనూరు శ్రీనీలకంఠేశ్వర స్వామి జాతర లో దేవదాయ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో ప్రజలు గుంపులు గుంపులుగా దుకాణాల వద్దే తిష్ట వేస్తున్నారు. ప్రజా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అధికారులు కూడ నిబంధనలు ఉల్లంఘింస్తే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం దుకాణా దారుల నుంచి వేలాది రూపాయలు వసూళ్లు చేసుకొని.. ప్రజా ఆరోగ్యం గాలికి వదిలేసినట్టు తెలుస్తోందాని అన్నారు. కానీ నిబంధనలు తుంగలో తొక్కి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న అధికారులను సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు తాలూకా అధ్యక్షులు రామకృష్ణ నాయుడు, నాయకులు లుముంబ, అమోస్, హరి, నవీన్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Shops should be removed at the fair-Municipal Commissioner should be suspended