Natyam ad

 స్ట్రాబెర్రీ  కేరాఫ్ ఏజెన్సీ

విశాఖపట్టణం  ముచ్చట్లు:

అమెరికాలో పురుడు పోసుకున్న లవ్ ఫ్రూట్.. స్ట్రాబెరీ పంట ఇప్పుడు మన చెంతే విరగ్గాస్తోంది. ఆంధ్రా కాశ్మీర్‌గా ప్రసిద్ధి చెందిన లంబసింగిలో గిరి రైతులు విజయవంతంగా ఈ పంటను సాగుచేస్తున్నారు. ఈ సీజన్ లో స్ట్రాబెర్రీ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.  గులాబీ జాతికి చెందిన స్ట్రాబెర్రీని మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో అధికంగా సాగుచేస్తున్నారు. రుచి, పరిమాణం, ఆకారం ఆధారంగా 500పైబడిన రకాలున్నాయి. లంబసింగి ప్రాంతంలో ‘వింటర్‌ డాన్‌’ అనే రకాన్ని రైతులు సాగుచేస్తున్నారు. స్ట్రాబెర్రీ మొక్క దిగువ భాగంలో ఫలాలు వస్తాయి. బెర్రీలు నేలకు తగలకుండా మొక్కచుట్టూ ఎండు గడ్డి వేస్తారు. లేదా పరదాలు పరుస్తారు.విశిష్టత కలిగిన స్ట్రాబెర్రీ సాగుకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ జిల్లా వాతావరణం అనుకూలంగా మారింది. 1995లో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి లంబసింగి అటవీ ప్రాంతం.. స్ట్రాబెరీ సాగుకు అనుకూలమని నిర్ధారించారు. మొదటి సారి సాగులోనే మంచి ఫలితం రావడంతో ఇక ఈ ఫలం సాగుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. చింతపల్లి మండలం లంబసింగికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొందిపాకలు గ్రామానికి చెందిన రైతు ఏజెన్సీ ప్రాంతంలో తొలిసారి స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. 2008లో పుణె నుంచి స్ట్రాబెర్రీ మొక్కలను దిగుమతి చేసుకుని ఎకరం విస్తీర్ణంలో నాటారు. అయితే మొదట్లో నీటి సదుపాయం లేకపోవడంతో పెట్టుబడి కూడా సరిగా రాలేదు. అయినా అనుకూలమైన వాతావరణంలో స్ట్రాబెర్రీ సాగుపై నమ్మకం పెట్టుకున్న ఆ రైతు.. సాగు కొనసాగిమాచాడు.

 

 

 

Post Midle

ఇప్పుడు లాభల పంట పందితున్నారు. 2019 నవంబరులో రెండు ఎకరాల్లో స్ట్రాబెర్రీ సాగు చేపట్టిమంచి లాభాలను అర్జించారు.లంబసింగిలో నాలుగేళ్లుగా స్ట్రాబెర్రీ సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. రైతు కుశలవుడుని ఆదర్శంగా తీసుకుని కొంత మంది మైదాన ప్రాంత రైతులు లంబసింగి పరిసర ప్రాంతాల్లో భూములను లీజుకు తీసుకుని 2018 నుంచి స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. 2020 నుంచి స్థానిక గిరిజన రైతులు కూడా స్ట్రాబెర్రీ సాగు ప్రారంభించారు. ప్రస్తుతం లంబసింగి, రాజుపాకలు, గొందిపాకలు, సిరిపురం, లబ్బంగి, చీకటిమామిడి, చిట్రాళ్లగొప్పు గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు.  లంబసింగి పరిసర ప్రాంతాల్లో రైతులు పండిస్తున్న స్ట్రాబెర్రీలను పర్యాటకులే అధికంగా కొనుగోలు చేస్తున్నారు. లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు నవంబరు మొదటి వారం నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. రైతులు పండించిన స్ట్రాబెర్రీల్లో 80 శాతం స్థానికంగానే అమ్ముడవుతుండగా, మిగిలిన 20 శాతాన్ని మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు.లంబసింగి ప్రాంతంలో స్ట్రాబెర్రీ దిగుబడులు ప్రారంభమయ్యాయి. స్థానికంగానే 200 గ్రాములు వంద రూపాయలకు విక్రయిస్తున్నారు.

 

 

 

లంబసింగి పరిసర ప్రాంతాల్లో ఐదేళ్లగా గిరిజన, కౌలు రైతులు స్ట్రాబెర్రీ సాగు చేస్తున్న విషయం తెలిసిందే. శీతాకాలంలో పండే స్ర్టాబెర్రీ పంటను ఈ ప్రాంతం సందర్శనకు వచ్చే పర్యాటకులు కొనుగోలు చేస్తుండడంతో రైతులకు మార్కెటింగ్‌ సమస్య తలెత్తడంలేదు. ఈ ఏడాది లంబసింగి పరిసర ప్రాంతాల్లో సుమారు 50 ఎకరాల్లో స్ట్రాబెర్రీ వేశారు. కొద్ది రోజుల నుంచి పండ్లు పక్వానికి రావడంతో రైతులు కోయడం ప్రారంభించారు. లంబసింగి జంక్షన్‌, లంబసింగి, రాజుపాకలు, చిట్రాళ్లగొప్పు గ్రామాల వద్ద రహదారికి ఇరువైపులా స్టాల్స్‌ ఏర్పాటుచేసి విక్రయిస్తున్నారు. 200 గ్రాముల చొప్పున పండ్లను ప్యాకింగ్‌ చేసి ఒక్కో ప్యాకెట్‌ను వంద చొప్పున అమ్ముతున్నారు. లంబసింగి సందర్శనకు వస్తున్న పర్యాటకులు స్ట్రాబెర్రీ తోటల వద్దకు వెళ్లి తాజా పండ్లను కొనుగోలు చేస్తున్నారు.అల్లూరి మన్యంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం స్టాబెర్రీకి అనుకూల వాతావరణం. ఎకరానికి 20 నుండి 22వేల మొక్కలను నాటుకోవాలి. దిగుబడి 8 నుండి 10 టన్నుల వరకు పంట వస్తుంది. స్టాబెర్రీ చాలా సున్నితంగా ఉంటుంది. నేల ద్వారా సంక్రమించే తెగుళ్లపై జాగ్రత్తలు పాటిస్తే.. మరింత నాణ్యమైన దిగుబడి వస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు.  మీరు ఎప్పుడైనా లంబసింగి ఏజెన్సీకి ఈ సీజన్లో వెళ్లినట్టు అయితే.. తాజాగా లభించే ఈ మధుర ఫలాన్ని ఆరగించి… ఆ మధుర జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోండి.

 

Tags: Strawberry Carafe Agency

Post Midle