Natyam ad

ఆలయభూములు అన్యాక్రాంతం

సికింద్రాబాద్ ముచ్చట్లు:

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరిలోనీ లాల్ బజార్ ఉన్న అతి పురాతన మైన చారిత్రాత్మకమైన అమ్మవారు మహంకాళి దేవాలయం వద్ద ఉన్న భూమి కబ్జాకు గురవుతుందని కొందరు భక్తులు, స్థానిక నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా  విలేకరులతో మాట్లాడుతూ పవిత్రమైన ఈ దేవాలయ భూమిని ప్రభుత్వము అధికారులు ఎండోమెంట్ అధికారులు పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా స్థానికులకు మద్దతుగా విచ్చేసిన బిజెపి నాయకురాలు నాగినెని సరిత ,స్థానిక నాయకుడు ప్రవీణ్ గౌడ్, మల్లేష్, చక్రవహచలం మాట్లాడుతూ… ఈ దేవాలయం భూమి సుమారు మూడున్నర ఎకరాలు పైగా ఉందని ఒక ఎకరం నరా పేరుమాలు దేవాలయం కు మరో ఎకరం నరా మహంకాళి దేవాలయంకు పేరుమాక్క అనే మహిళ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ భూమి సర్వే నెంబర్ 21 బై వన్ ,21 బై టు, 22 బై వన్ లలో  ఉన్న భూమి కొందరు నాయకులుగా చలామణి అవుతున్నవారు  కబ్జా చేస్తూ నిర్మాణాలకు సన్నద్దమయ్యారని వారు ఆరోపించారు .ఒకసారి ఈ భూమిని కొందరు దాతలు దేవాలయానికి దానం చేశారని తిరిగి ఆ దానం చేసిన వారసులు తమకు అమ్మేరని రిజిస్ట్రేషన్ అయిపోయిందని ప్రచారం చేస్తూ నాయకుల మని చెప్పుకునే వారు కొందరు భూమిపై మట్టి పోస్తూ సదును చేస్తూ ఆక్రమాలకు పాల్పడుతున్నారనీ ఆరోపించారు. మహంకాళి దేవాలయము కనకదుర్గమ్మ దేవాలయం పేర్లతో ఈ ప్రాంతంలో భక్తులు కోలుసుకుంటారని బోనాలు, వివిధ పండగలకు ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారి దీవెనలు భక్తులు పొందుతుంటారని అన్నారు. చరిత్ర కలిగిన ఈ దేవాలయ భూమిని కబ్జా గురికావడం వల్ల భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని  స్థానికుల ఆరోపణ.

 

Post Midle

Tags: Temple lands are alienated

Post Midle