మునుగోడు ఉప ఎన్నిక తప్పదా.
ఖమ్మం ముచ్చట్లు:
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామాకు సిద్దమయ్యారు. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ను కలిసినప్పటి నుంచి ఆయన బీజేపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో రాజగోపాల రెడ్డి కూడా గత రెండు రోజులుగా అవును, కాదంటూనే అవునే సంకేతాలు ఇస్తున్నారు.కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే, శాసన సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని, చెప్పారు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎన్నికలలో ఓడించే లక్ష్యంతోనే బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్నారు. తెరాసను ఓడించడం కాంగ్రెస్ తో కాదని,అందుకే, కాంగ్రెస్ ను వాదులుతున్నానని చెపుతున్నారు. నిజానికి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెరాసపై వత్తిడి పెంచేందుకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వస్తున్నారని రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా వినవస్తోంది. అందులో భాగంగానే, అమిత్ షా, మునుగోడు ఉపఎన్నికకు స్కెచ్ సిద్దం చేశారని అంటున్నారు. అంతే కాకుండా, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా తెరాస మీద వత్తిడి పెంచడంతో పాటుగా, ఇటీవల చేరికలతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీలో, రేవంత్ వ్యతిరేక వర్గాన్ని ‘ఉత్సాహ’ పరిచే వ్యూహం కూడా ఉందని అంటున్నారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధిని మూడవ స్థానానికి నేట్టేస్తే, రేవంతే రెడ్డి దూకుడుకు బ్రేకులు పడతాయని, అందు కోసం అయినా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ సీనియర్ల సహకారం కూడా రాజగోపాల్ రెడ్డికి ఉంటుందని అంటున్నారు. మునుగోడులో హుజురాబాద్ రిపీట్ ఆయితే, రేవంత్ రెడ్డికి చిక్కులు తప్పవని, అందుకే అమిత్ షా ఉప ఎన్నిక వ్యూహం సిద్దం చేశారని అంటున్నారు. ఆదలా ఉంటే, తెరాస కూడా ఉపఎన్నిక ఖాయమనే నిర్ణయానికి వచ్చినట్లు తెసుస్తోంది. అందుకే, సన్నాహాలకు శ్రీకారం చుట్టింది. ఉప ఎన్నికల వరాల మూటను విప్పింది.
గతంలో బౌన్స్ అయిన కల్యాణ లక్ష్మి చెక్కుల స్థానంలో కొత్త చెక్కులను పంపిణీని మంత్రి జగదీష్ రెడ్డి ఆదివారమే ప్రారంభించారు. పనిలో పనిగా, చెక్కుల బౌన్సుకు, ఇంత కాలం పంపిణీ ఆగిపోవదానికీ కూడా ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి అందుబాటులో లేక పోవడమే కారణమని మంత్రి జగదీశ్ రెడ్డి తొలి మిస్సైల్ పేల్చారు. అలాగే, ప్రజలు అడిగినప్పుడ కాదన్న, గట్టుప్పలను ప్రత్యేక మండల కేంద్రంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఎక్కడ ఉప ఎన్నికలు జరిగితే, అక్కడ, ‘పనులు’ ప్రారంభించే అలవాటైన పద్దతిలో మునుగోడులోనూ పెండింగ్ పనులపై అధికారులు దృష్టి సారించారు. మరో వంక నియోజకవర్గంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులకు గులాబీ కండువాలు కప్పే క్రతువు ప్రారంభమైంది. ఒక సర్పంచ్, ఒకరిద్దరు ఎంపీటీసీలకు మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పారు.మరి కొంతమంది కూడా చెప్పుల్లో కాలు పెట్టుకుని, కారేక్కేందుకు రెడీ’గా ఉన్నారని అంటున్నారు. ఎవరి సంగతి ఎలా ఉన్నా, మునుగోడు ఓటర్లు మాత్రం ఉప ఎన్నిక అనగానే ఉబ్బు తబ్బిబ్బవుతున్నారు. హుజురాబాద్. వైభోగం తమకూ పడుతుందని అంటున్నారు. అదలా ఉంటే మునుగోడు ఉపఎన్నిక బాధ్యతలు ముఖ్యమంత్రి, వరసగా రెండు నియోజక వర్గాల్లో (దుబ్బాక,హుజురాబాద్)తెరాస అభ్యర్ధులను దిగ్విజయంగా ఓడించిన, మంత్రి హరీష్ రావుకు, ‘హ్యాట్రిక్’ ఛాన్స్ ఇస్తారా, లేక జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగిస్తారా లేక స్వయంగా కేసీఆర్, కేటీఆర్ బుజానికి ఎత్తుకుంటారా అనేది చూడవలసి ఉందని అంటున్నారు.

Tags: The previous by-election is a mistake.
