Natyam ad

దుర్ఘటన బాధాకరం-మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు ముచ్చట్లు:


కందుకూరు ఘటన పై  రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఘటన పై విచారం వ్యక్తం చేసారు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందడం, అనేక మంది గాయ పడడం బాధాకరమని అన్నారు. ఒకపక్కన సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతే, అందురు ఇక్కడే ఉన్నండి సభ కొనసాగిస్తా అని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి రావాలన్న తన ఆరాటం అందులో కనిపిస్తుంది. మంచి చెడ్డలు లేకుండా, అయ్యోపాపం మన కోసం వచ్చి చనిపోయారు అని లేకుండా అలా సమావేశం కొనసాగించడం బాధాకరం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇరుకైన సందుల్లో, చిన్న చిన్న జంక్షన్లలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటి చోట్ల ఇలాంటి సమావేశాలు అనుమతి ఇవ్వకూడదు అని సీఎస్, డిజిపి, కలెక్టర్లు, ఎస్పి లను కోరుతున్నా. ఇలాంటి ఘటనలు జరిగే ఆస్కారం లేని విశాలమైన ప్రాంతాల్లో మాత్రమే అనుమతులు మంజూరు చేయాలి. ఈ ఘటన లో 8 మంది చనిపోవడం దురదృష్టం, ప్రభుత్వం తరపున చింతిస్తున్నాం. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని పేపర్లో చూసాను అందులో ఆశ్చర్యం లేదు. రోజు 10 కిలోమీటర్లు నడవడం ఆయన ఆరోగ్యానికి మంచిది. రాజకీయాల్లో ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అనేది ప్రధానం.

 

 

 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, ఇన్నేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అయన తండ్రి ప్రజలకు ఏం చేశారు. గతంలో 30 ఏళ్లు పుంగనూరు ఒకే కుటుంబం చేతిలో ఉంది, వారు అభివృద్ధి చేసుంటే ఈ రోజు ఇలా కష్టపడే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు మనం పెద్ద స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. వారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుంటే ఇప్పుడు మనకు చేయడానికి ఏమి ఉండేది కాదు. ఇదే విధంగా చంద్రబాబు, లోకేష్ రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల గురించి కానీ పట్టించుకోవట్లేదు. కేవలం అధికారం లోకి రావడం కోసమే చూస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు, జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. లోకేష్ పాదయాత్ర గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్ మోహన్ రెడ్డి కి నమ్మకంగా ఉన్నమానే మా పై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుందని అన్నారు.

 

Post Midle

Tags: The tragedy is sad – Minister Peddireddy

Post Midle