యోగాతో మానసిక ఒత్తిడిని జయించవచ్చు- డా. తలమంచి వినోద్ కుమార్ రెడ్డి

నెల్లూరు ముచ్చట్లు:


 మానసిక ఒత్తిడిని నివారించడంతో పాటు వివిధ రోగాలను అరికట్టి మనశ్శాంతిని కలిగించేదే యోగా అని జయభారత్ హాస్పిటల్ ప్రముఖ యూరాలజిస్ట్ డా.తలమంచి వినోద్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం 8 వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా వెంకటేశ్వరపురం, శ్రీసాయి యోగా ధ్యాన మందిరం నందు పీఎంపీ అసోసియేషన్, శ్రీసాయి యోగ ధ్యాన మందిరం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మన పూర్వీకులు కేవలం యోగాతోనే ఎన్నో సంవత్సరాలు జీవించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిచోటా కుల మతాలు లేకుండా వయస్సుతో నిమిత్తం లేకుండా, స్త్రీ,పురుషులు,  పిల్లలు అందరూ ఎలాంటి ఖర్చు లేకుండా యోగాను ఆచరించవచ్చుఅని ఆయన  అన్నారు. యోగాతో ఆరోగ్యంతోపాటు ఏకాగ్రత పెరుగుతుందని దానివల్ల విద్యార్థులు తమ చదువులో రాణించే అవకాశం ఉందన్నారు. భారత ప్రధాని మోడీ  యోగాను విశ్వవ్యాప్తం చేయడం   అభినందనీయమన్నారు. ప్రముఖ ల్యాపరోస్కోపిక్ సర్జన్ డా.పాలకొల్లు అమర్నాద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రతిరోజూ     యోగాను విధిగా నేర్పించాలన్నారు. తల్లిదండ్రులు తమపిల్లలకు యోగా విషయంలో సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు నిత్యం వారు యోగా చేసే విధంగా చూడాలన్నారు. జిల్లా పీఎంపీ గౌరవాధ్యక్షులు అనుముల జయప్రకాశ్ మాట్లాడుతూ మానవుడు తనజీవన శైలిలో యోగాను ఒక భాగం చేసిన రోజున వివిధ వ్యాధులను నివారించి,  సంపూర్ణ ఆరోగ్యంతో ఉల్లాసంగా జీవించే అవకాశం ఉందన్నారు. శ్రీసాయి యోగ ధ్యాన మందిరం చైర్మన్ నరసాపురం ప్రసాద్ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలనుండి క్రమం తప్పకుండా యోగ దినోత్సవం నిర్వహిస్తున్నామని, యోగడే రోజునే కాకుండా ప్రతిరోజూ ఉచితముగా యోగ తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం యోగా ధీమ్ “మానవత్వం కోసం యోగా” గా నిర్ణయించారని, యోగా అంటే ఆనందం, ఆరోగ్యం, శాంతిని కలిగించే అభ్యసమని తెలిపిన్నారు. ఈకార్యక్రమములో డా.పి. శ్రీనివాసులు, జయభారత్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ మారేళ్ల గురు ప్రసాద్, రూడ్స్ చైర్మన్ షేక్ రసూల్, డి. విజయలక్ష్మి పి.ఎం.పి అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్,  పిఎంపీ నాయకులు జి.శేషయ్య, యు. రామదాసు, పి.మోహన్, మస్తాన్ వలి, సుభాన్, రాజేష్, నారాయణ, ఇర్ఫాన్, మునీర్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: You can conquer stress with yoga- Dr. Talamanchi Vinod Kumar Reddy

Post Midle
Natyam ad