Natyam ad

ఆగస్టులో బ్యాంకులకు 13 రోజుల సెలవులు

ముంబై ముచ్చట్లు:


2022 సంవత్సరంలో 8వ నెల ప్రారంభం కానుంది. మీరు ఆగస్టులో బ్యాంకుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులను చేసుకోవాలంటే ఆ నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. ఆగస్టు నెలలో ఉండే బ్యాంకుల సెలవులను ముందస్తుగా తెలుసుకుంటే బ్యాంకింగ్‌కు సంబంధించిన పనులను చేసుకునేందుకు ప్లాన్‌ చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతినెల బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. అలాగే ఆగస్టు నెలలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి.ఆగస్టు నెలలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పండుగలు జరుపుకుంటారు. ఇందులో స్వాతంత్ర్య దినోత్సవం 2022, రక్షాబంధన్ 2022, జన్మాష్టమి 2022 వంటి పండుగలు ఉన్నాయి. ఆగస్టులో శని, ఆదివారాలు సహా మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

 

ఆగస్టులో బ్యాంకులకు సెలవులు:
ఆగస్టు 1న ద్రుపక షీ-జీ పండుగ కారణంగా సిక్కిం రాష్ట్రంలోని గ్యాంగ్‌టక్‌లో అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి)
ఆగస్టు 7న ఆదివారం
8 ఆగస్టు 2022- ముహర్రం (జమ్ము మరియు శ్రీనగర్)
9 ఆగస్టు 2022- చండీగఢ్, గౌహతి, ఇంఫాల్, డెహ్రాదు తిరువనంతపురం, భువనేశ్వర్, జమ్మూ, పనాజీ, షిల్లాంగ్ మినహా దేశమంతా సెలవు ఉంటుంది
11 ఆగస్టు 2022- రక్షాబంధన్ (దేశమంతటా సెలవు)
13 ఆగస్టు 2022- రెండవ శనివారం
14 ఆగస్టు 2022- ఆదివారం
15 ఆగస్టు 2022- స్వాతంత్ర్య దినోత్సవం
16 ఆగస్టు 2022- పార్సీ నూతన సంవత్సరం (ముంబై, నాగ్‌పూర్‌లలో సెలవు)
18 ఆగస్టు 2022- జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూతపడతాయి
21 ఆగస్టు 2022- ఆదివారం
28 ఆగస్టు 2022-ఆదివారం
31 ఆగస్టు 2022 – గణేష్ చతుర్థి

 

Post Midle

Tags: 13 days bank holidays in August

Post Midle