Natyam ad

మంచులింగాన్ని దర్శించుకున్న 2 లక్షల 80 వేల మంది

కొలంబో ముచ్చట్లు:


భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్‌ యాత్రను మరోసారి నిలిపివేశారు. జమ్మూ లోని బేస్‌ క్యాంప్‌ లోనే యాత్రికులకు నిలిపివేశారు. అయితే తాము ఎలాగైనా మంచుకొండల్లో వెలిసిన బోళా శంకరుడిని దర్శించుకుంటామంటున్నారు భక్తులు. అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు నాలుగు వేల మంది జమ్ము బేస్‌ క్యాంప్‌ నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో వాళ్లు ముందుకెళ్లడానికి అధికారులు అనుమతించలేదు. ఇప్పటివరకు 2 లక్షల 80 వేల మంది యాత్రికులు మంచులింగాన్ని దర్శించుకున్నారు.అమర్‌నాథ్‌ యాత్రలో కొంతమంది భక్తులకు శ్వాసపరమైన ఇబ్బందులు వస్తున్నాయి. ఐటీబీపీ సిబ్బంది వెంటనే వాళ్లకు ఆక్సిజన్‌ అందిస్తున్నారు. ప్రాణాలను కాపాడుతున్నారు. ఎత్తైన ప్రాంతం కావడంతో వాళ్లు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో ఐటీబీపీ సిబ్బంది ఆదుకున్నారు. శేష్‌నాగ్‌ దగ్గర ఇప్పటివరకు 2000 మంది యాత్రికులకు ఆక్సిజన్‌ అందించినట్టు ఐటీబీపీ సిబ్బంది తెలిపారు. వర్షాల కారణంగా అమర్‌నాథ్‌ యాత్రకు పలుమార్లు బ్రేక్‌ పడుతోంది. అయినప్పటికి ముందుకే వెళ్తున్నారు భక్తులు.

 

Tags: 2 lakh 80 thousand people visited Manchulinga

Post Midle
Post Midle