మంత్రాలయం మఠంలో విరిగిన జమ్మి వృక్షం
మంత్రాలయం ముచ్చట్లు:
కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో 250 సంవత్సరాల చరిత్ర కలిగిన పెద్ద జమ్మిచెట్టు విరిగి పడడంతో తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. భక్తులు లేని సమయంలో జమ్మిచెట్టు విరిగి పడడంతో ఊపిరి పీల్చుకున్నారు శ్రీ మఠం అధికారులు, భక్తులు. తరతరాలుగా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన పీఠాధిపతులు ఆ మహా వృక్షంకు నిత్యం పూజలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీ రాఘవేంద్రస్వామి ని దర్శించుకుని ఆ జమ్మిచెట్టు కు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు లేని సమయంలో జమ్మిచెట్టు విరిగి పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Tags: A broken Jammi tree in Mantralayam Math

