Natyam ad

మంత్రి జగదీష్ ను అడ్డుకున్న బీజేపీ నేతలు

చౌటుప్పల్ ముచ్చట్లు:


యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ   సహకార సంఘం గోడ నిర్మాణ కార్యక్రమంలో రసభసా గా జరిగింది. బీజేపీ వాళ్ళని బట్టలు ఊడదీసి కొడతానని మంత్రి జగదీశ్వర్ రెడ్డి  అన్నారు. ఈ కార్యక్రమంలో  డీసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు,కళ్యాణ లక్ష్మి,,రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఘనత కేసీఆర్ దే అని మాట్లాడుతున్న క్రమంలో స్టేజి మీద ఉన్న బిజెపికి పార్టీకి సంబంధించిన సహకార సంఘ  డైరెక్టర్లు వ్యతిరేకరించారు.  ఇది పార్టీ కార్యక్రమం కాదు రైతుల సంబంధించిన సహకార సంఘం సంబంధించి గోడ నిర్మాణ కార్యక్రమంలో ఇలాంటి రాజకీయాలు మాట్లాడొద్దు అంటూ బిజెపి పార్టీ కి చెందిన సహకార సంఘ డైరెక్టర్లు వారించారు.  ఈ క్రమంలోనే బిజెపి పార్టీకి సంబంధించిన ఇద్దరు డైరెక్టర్లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

పక్కనే ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి మైక్ తీసుకొని మాట్లాడుతూ.. కెసిఆర్ ఈ రాష్ట్రానికి అండదండ అని ఇక్కడ సహకార సంఘానికి శుభాకాంక్షలు చెప్పి వెళ్దాం అనుకున్నా కానీ ఇక్కడ బిజెపికి సంబంధించిన వాళ్ళు ఇలా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని,బిజెపి వాళ్లని బట్టలిప్పి కొడతానని,  రండిరా చూసుకుందామని బిజెపి సహకార సంఘ  డైరెక్టర్లకు  స్టేజి పైనుంచే వార్నింగ్ ఇచ్చారు.
మంత్రిమాట్లాడుతూ  రైతులను మోసం చేసిన మోడీ ప్రభుత్వం. అమ్ముడు పోయిన  దొంగలు బీజేపీ పార్టీ వాళ్ళు. ప్రజలు టీఆరెఎస్ తోనే వున్నరు. ప్రజా కోర్టులో మీకు శిక్ష పడుతుంది అని ఆగ్రహించారు.

 

Post Midle

Tags: BJP leaders who blocked Minister Jagdish

Post Midle