పుంగనూరులో సంబరాలు
పుంగనూరు ముచ్చట్లు:
భారతదేశ రాష్ట్రపతిగా ఆదివాసి మహిళ ద్రౌపతి ముర్ము తొలిసారిగా ప్రమాణస్వీకారం చేయడం పట్ల స్రంబరాలు నిర్వహించారు. సోమవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద గిరిజన సంఘాల నాయకులు ఎం.రామకృష్ణ, ఎం.బాబు, శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాష్ట్రపతి చిత్రపటాన్ని ఉంచి కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. రామకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంతోనే ఆదివాసి మహిళ అగ్రపీఠాన్ని అధిరోహించడం సాధ్యమైందన్నారు.ఆమె దేశానికి ఉన్నత సేవలు అందిస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎరుకుల సంక్షేమ సంఘం నాయకులు విజయకుమార్, శివ, బహుజన సంక్షేమ సంఘం నాయకులు శ్రీనివాసులు, జెవి.నాగరాజు, ఆంజప్ప, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

Tags: Celebrations in Punganur
