Natyam ad

చంద్రబాబు కుట్రలతో మంచినీటి ప్రాజెక్టులకు అడ్డు- వైఎస్సార్‌సీపీ ఆగ్రహం

-కుప్పంకు నీరు ఇవ్వడం ఇష్టంలేదా
-వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తీరిన దాహార్తి
-రెండు జిల్లాల ప్రజలను మోసగిస్తున్న పచ్చనేతలు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

పడమటి నియోజకవర్గాలలో తాగునీరు-సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన మూడు రిజర్వాయర్ల పనులను అడ్డుకునేందుకు చంద్రబాబునాయుడు కుట్రలు పన్నుతు చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ప్రజలను మోసగిస్తున్నారని రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, జిల్లా ఎంపీపీల సంఘ అధ్యక్షుడు రెడ్డెప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పడమటి నియోజకవర్గాలైన తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పం ప్రజలకు నీరు అందించేందుకు హంద్రీనీవా కాలువను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే నేతిగుట్లపల్లె, ఆవులపల్లె, ముదివేడులో సుమారు 6.50 టిఎంసీల నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్ల నిర్మాణాన్ని తప్పుడు కేసులతో పచ్చనాయకులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పలమనేరు, కుప్పంకు నీరు తరలించే కార్యక్రమాన్ని బాబు అడ్డుకోవడం బాధకరమన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఒక్క ప్రాజెక్టెన నిర్మించారా అని నిలధీశారు.

 

 

 

 

చిత్తూరు జిల్లా ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను పాదయాత్రలో గమనించిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల కోరిక మేరకు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే కడప జిల్లా నుంచి గండికోట రిజర్వాయర్‌ ద్వారా , పైపులైన్ల ద్వారా పడమటి నియోజకవర్గాలకు నీరు అందించే కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి బెంబేలెత్తిన బాబు అండ్‌కో అడ్డుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఈ సారి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చిత్తూరు జిల్లాలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని ఎద్దెవా చేశారు.ప్రాజెక్టులపై న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ పచ్చ చొక్కాల ఆగడాలను ప్రజలకు వివరిస్తూ పడమటి నియోజకవర్గాలలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు జరిగే మేలు గూర్చి వివరిస్తూ ప్రజా ఉధ్యమం చేపడుతామని స్పష్టం చేశారు.

 

Tags; Chandrababu’s conspiracies obstructed fresh water projects – YSRCP angered

 

Post Midle