Natyam ad

జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ

డోన్ ముచ్చట్లు:

 

డోన్ లో నంద్యాల జిల్లా కలెక్టర్ మునజీర్ జిలని సామూన్ ఆకస్మికంగా తనిఖీ చేసారు, స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ఓటర్ నమోదు కార్యక్రమం లో జరిగిన ఓటర్ లిస్ట్ ను పరీశీలించారు, అలాగే పాత ఓటర్ లిస్ట్, కొత్త ఓటర్ లిస్ట్ లో బేధాలు గురించి వివరాలు అడిగి లేలుసుకొని ఆర్ డి ఓ వెంకట రెడ్డి, తహసీల్దార్ విద్యా సాగర్ లతో చర్చలు జరిపారు, ఏమాత్రం తప్పులు జరగకూడని వారికీ తెలియ జేశారు,అలాగే రెవిన్యూ సంబందించిన రికార్డు లను కూడా పరీసీలించి వాటి వివరాలు అడిగి తెలుసు కొన్నారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ తహసీల్దార్ మధు ఆర్ ఐ, వి ఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: District Collector’s surprise inspection

Post Midle
Post Midle