Natyam ad

కరువు జిల్లాగా ప్రకటించి ప్రతి రైతును ఆదుకోవాలి

-ఎండిపోయిన పంటలకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి

కౌతాళం ముచ్చట్లు:

Post Midle

కౌతాళం మండలం పొదలకుంట దగ్గర ఎల్ ఎల్ సి  కాలువ ను,  ఎండిన పంటలను మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డిబుధవారం పరిశీలించారు.  రాష్ట్రంలో మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసిపి ప్రభుత్వం రైతులకు ఎందుకు సక్రమంగా  సాగునీరు అందించడం లేదు అని కౌతాళం మండలం పొదలకుంట గ్రామం దగ్గర తుంగభద్ర ఎల్ ఎల్ సి సాగునీటి కాలువను చివరి ఆయకట్టకు నీరు అందక ఎండిపోయిన పంటలను మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి పరిశీలించారు వారు పంటలను పరిశీలించి అనంతరం పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే అధికారులు గాని, వైసీపీ ప్రభుత్వ నాయకులు గాని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అర్థం కావడం లేదని రైతులు చాలా ఖర్చులతో పెట్టుబడి పెట్టి పంట కోత కోసే సమయంలో నీరు లేకపోవడం వల్ల చాలా పంటలు ఎండి పోతుంటే వైసిపి ఎమ్మెల్యే బాలనాగరెడ్డికి కనబడడం లేదా ఎల్ ఎల్ సి అధికారులకు కనపడటం లేదా అని వారు అన్నారు  పంట ఎండిపోయి, నష్టపోయిన రైతులకు తక్షణమే వరి రైతులకు ఎకరాకు 50 వేలు, మిరప రైతులకు ఎకరాకు లక్ష యాభై వేలు, పత్తి రైతులకు ఎకరాకు 70 వేలు సహాయం చేసి ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే నిలిచిపోయిన సాగు నీటి సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో భారీ ఎత్తున ఆందోళన చేస్తామని పాలకుర్తి తిక్కారెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చేన్నబసప్ప డేని, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి  కోట్రేష్ గౌడ్, రమేష్ గౌడ్, మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షులు టిప్పు సుల్తాన్, టి ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివమూర్తి, శివప్ప గౌడ్, డాక్టర్ రాజానంద్, పొదలకుంట సర్పంచ్ రంగస్వామి, హాల్వి హుసేని తదితరులు పాల్గోన్నారు.

 

Tags: Every farmer should be supported by declaring it a drought district

Post Midle