Natyam ad

28న మంత్రి పెద్దిరెడ్డిచే అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పుంగనూరులో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి, పలు పనులకు భూమిపూజ చేయనున్నారు. మంత్రి పెద్దిరెడ్డి గూడూరుపల్లె వద్ద జగనన్న కాలనీల ఇండ్ల పట్టాలను 600 మందికి పంపిణీ చేయనున్నారు. అలాగే నెక్కుంది శ్రీఅగస్తీశ్వరస్వామి ఆలయంలో సుమారు రూ.2 కోట్లతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభిస్తారు. అలాగే పట్టణ సమీపంలోని బైపాస్‌రోడ్డులో నూతన ఆర్టీవో కార్యాలయానికి భూమి పూజ చేసి, పనులు ప్రారంభిస్తారు.అక్కడి నుంచి నేరుగా రాంపల్లెకి వెళ్లి మసీదును ప్రారంభిస్తారు. అక్కడ నుంచి గూడూరుపల్లె వద్దకు వచ్చి అక్కడ నిర్మించనున్న బ్రాహ్మణ కమ్యూనిటి భవనము, రోటరీ భవనము, మానవత స్వచ్చంధ సంస్థ భవన్‌ను , వాల్మీకి భవనం, రైతు భవన్‌తో పాటు సెబ్‌ కార్యాలయాల పనులకు భూమిపూజ చేయనున్నారు.అలాగే పలు వివాహా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా శనివారం తెలిపారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేసేందుకు ఆయా సంఘాల ప్రతినిధులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి ఒక్కరు మంత్రి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

 

Post Midle

Tags: Foundation stone laying for development works by Minister Peddireddy on 28th

Post Midle