కాల్పులు కలకలం.. రామచంద్రాపురం సర్పంచ్ పై దుండగుల దాడి
శ్రీకాకుళం ముచ్చట్లు:
శ్రీకాకుళంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణమూర్తి పై దుండగులు కాల్పులు జరిపారు. తూటలు వెంకటరమణ పొట్టను రాసుకుంటూ వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. రామచంద్రపురం గ్రామ సర్పంచ్ వెంకటరమణమూర్తిపై అర్ధరాత్రి దుండగులు కాల్పులు జరిపారు. మధురానగర్లోని ఆయన కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ రాత్రి వెళ్లింది. ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను వెంటతీసుకెళ్లింది. వీరి మధ్య సంభాషణలు జరుగుతుండగా ఆమెతో వచ్చిన వ్యక్తులు తుపాకితో రెండుసార్లు కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారయ్యారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Gunfire .. Thugs attack Ramachandrapuram Sarpanch