Natyam ad

MLA అభ్యర్థి వెంకటేగౌడ నామినేషన్ దాఖలు

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు పట్టణంలోని ఎద్దుల సంత వీధిలోని ఓం శక్తి అమ్మవారి దేవాలయంలో సతి సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పలమనేరు నియోజకవర్గ వైస్సార్సీపీ MLA అభ్యర్థి వెంకటేగౌడ   పూజానంతరం నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ర్యాలీగా ముందుకు కదలడం జరిగింది.మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి  సారధ్యంలో గణేష్ యాదవ్ ని వైస్సార్సీపీ లోకి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.తదుపరి వెంకటేగౌడ గారు అశేష జన వాహినితో కలిసి అయ్యాకన్న వీధి, బజార్ వీధి మీదగా జవిళి వీధి నుండి MBT రోడ్ మీదగా టవర్ క్లాక్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి  మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గంని అభివృద్ధి పథంలో నడపడంలో వెంకటేగౌడ సఫలికృతమైనందు వలనే సీఎం వైయస్ జగన్  వెంకటేగౌడకి రెండవ సారి పలమనేరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు, కావున మీరందరూ ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాని తెలిపారు..

 

 

Post Midle

పలమనేరు నియోజకవర్గ వైస్సార్సీపీ అభ్యర్థి వెంకటేగౌడ  మాట్లాడుతూ మీ ఆశీర్వాదంతో నేడు పలమనేరు నియోజకవర్గ వైస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, మీరే నా బలం మీరేనా బలగం అందుకే మీ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నానని నిండు మనసుతో పెద్దలందరూ ఆశీస్సులను అందించాలని, యువతి, యువకులంతా వారి సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరుతున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు , RVS బోస్ ,గణేష్ యాదవ్ , కుప్పం KRJ భరత్  మరియు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,వైస్సార్సీపీ కుటుంబ సభ్యులు, అభిమానులు,ప్రజలు పాల్గొన్నారు.

Tags: MLA candidate Venkate Gowda files nomination

Post Midle