Natyam ad

పుంగనూరులో క్రీకెట్‌ విజేతలకు రూ.50 వేలు, ట్రోపి

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు రూరల్‌ మండలంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన క్రీకెట్‌ టోర్నమెంటులో ఫ్రెండ్స్లెవల్‌ సంఘం విజేతలుగా నిలిచారు. గురువారం సాయంత్రం తుదిమ్యాచ్‌ ఏతూరు మైదానంలో జరిగింది. విజేతలకు వైఎస్సార్‌సీపీ నాయకులు చెంగారె డ్డి, రాజశేఖర్‌రెడ్డి కలసి ట్రోపిని, రూ.50 వేలు చెక్కును అందజేశారు. అలాగే విశ్రాంత ఆర్మీ ఉద్యోగులకు రెండవ బహుమతి క్రింద రూ.30 వేలు చెక్కును అందజేశారు. కాగా ఐదు రోజుల పాటు విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు, ఫ్రెండ్స్లెవల్‌ సంఘం , వైఎస్సార్‌సీపీ నాయకులు టోర్నమెంటులు నిర్వహించగా 50 టీములు వారు పోటీలో పాల్గొన్నారు. ముగింపు సంబరాలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శివ, ప్రశాంత్‌రెడ్డి, మంజునాథ్‌రెడ్డి, మహేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Rs 50,000, trophy for cricket winners in Punganur