Natyam ad

పుంగనూరులో రెండవ రోజు పెన్షన్లు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:
 
పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రెండవ రోజు ఆదివారం పుంగనూరు రూరల్‌ మండలంలో ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. మండలంలోని కుమ్మరనత్తం, బండ్లపల్లె, చండ్రమాకులపాల్లె, కుమ్మరగుంట, తమ్మరాజుపల్లె గ్రామాల్లో పెన్షన్లు పంపిణీ నిర్వహించారు. అలాగే మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ రసూల్‌ఖాన్‌ ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటిలో 94 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్లు కమిషనర్‌ తెలిపారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Second day distribution of pensions in Punganur