Natyam ad

ఆరుగురు వేటగాళ్లు ఆరెస్లు

కాకినాడ ముచ్చట్లు:

కాకినాడ జిల్లా  కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని పలు గ్రామాల్లో అనధికారికంగా పక్షులను వేటాడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పది సింగిల్ బేరల్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.కాకినాడ జిల్లా స్పెషల్ బ్రాంచ్ వారికి ఎటువంటి అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా సింగిల్ బెరల్ కలిగిన తుపాకులను నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించి , పక్షులను వేటాడుచున్నారని వచ్చిన సమాచారంపై కాకినాడ జిల్లా ఎస్పి ఎం. రవీంద్రనాధ్ బాబు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ పి.శ్రీనివాస్ , కాకినాడ డిఎస్పి వి . భీమారావు , రూరల్ సి.ఐ. శ్రీనివాస్ పర్యవేక్షణలో కరప ఎస్ఐ రమేష్ బాబు తన సిబ్బందితో , మద్యవర్తులను తీసుకుని అడవిపూడి గ్రామానికి వెళ్ళి అక్కడ 3 సింగిల్ బెరల్ తుపాకులను , గొర్రిపూడి గ్రామంలో 5 తుపాకులను , కొంగోడు గ్రామంలో 2 తుపాకులను మొత్తం 10 సింగిల్ బేరల్ కలిగిన తుపాకులను , వాటికి సంబంధించిన ప్రేలుడు పదార్థాలైన గన్ ఫౌడర్ను స్వాధీన పరచుకుని ఆరుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి కరప పి. ఎస్.లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . ఎటువంటి అనుమతులు లేకుండా తుపాకులు కలిగివుండుట , పక్షులను వేటాడటం చట్టరీత్యా నేరం కాబట్టి చట్టానికి వ్యతిరేకంగా పనిచేసేవారిపై కేసులు నమోదు చేస్తామని డిఎస్పి తెలియచేసారు .

 

Tags: Six hunters were killed

Post Midle
Post Midle