Natyam ad

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తేలేదు -ఎంపీ మిధున్‌రెడ్డి

– జగనన్న పాలన సంపూర్ణంగా సాగుతుంది.
-ఆరాచక పాలనలో ఎలా తిరుగుతున్నారు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలన సంతృప్తికరంగా , సంపూర్ణంగా సాగుతోందని, ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని లోక్‌ సభ ప్యానల్‌ స్పీకర్‌ , రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన పుంగనూరులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాదన్నారు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామన్నారు. ఎన్నికల్లో తాము అందించిన సంక్షేమ పథకాలను ధైర్యంగా ప్రజలకు వెల్లడిస్తామన్నారు. ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నట్లు రాక్షస పాలన జరుగుతోందని అనే వారే సిగ్గుపడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గన్‌మెన్లతో రక్షణ పొందుతూ రాష్ట్రంలో ప్రశాంతంగా కోరిన ప్రాంతానికి వెళ్తున్న ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చెప్పిన హామిలను 98 శాతం అమలు చేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలనల అందిస్తూ ప్రజల అభిమానం చూరకొన్నారని తెలిపారు.

 

Tags: There is no question of going to early elections – MP Midhun Reddy

Post Midle