రెండు లారీలు ఢీ…డ్రైవర్ మృతి
ఎన్టీఆర్ ముచ్చట్లు:
తిరువూరు పట్టణంలోని బైపాస్ రోడ్డు గ్యాస్ కంపెనీ సమీపంలో జాతీయ రహదారిపై ఎదురు ఎదురుగా రెండు లారీలు ఢీకొన్నాయి. చర్ల నుండి విజయవాడ వెళుతున్న ఇండియన్ గ్యాస్ సిలిండర్ల లారీ, తమిళనాడు రాష్ట్రం నుండి తెలంగాణ వైపు వెళుతున్న కూరగాయల లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో రెండు లారీల క్యాబిన్లలో ఇద్దరు డ్రైవర్లు ఇరుక్కుపోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి డ్రైవర్లను బయటకు తీసారు. ప్రయాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. బండారి కొండ అనే లారీ డ్రైవర్ మృతి చెందగా, మరో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని 108 అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Tags: Two lorries collided…driver died

