కల్వర్టును ఢీకొన్న స్కూల్ బస్సు
ఇద్దరు విద్యార్దులకు స్వల్ప గాయాలు
ముమ్మిడివరం ముచ్చట్లు:
స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సుకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను అమలాపురం తీసుకెళ్తున్న ప్రయివేటు స్కూలు బస్సు కాట్రేనికోన మండలం కందికుప్ప పెట్రోలు బంకు వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఘటనలో విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. డ్రైవర్ అతివేగమే కారణమని స్దానికులు అంటున్ఆరు. వంతెన ఇరుకుగా ఉండటంతో తరచుగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని స్దానికుల కధనం.

Tags: A school bus hit a culvert
