పుంగనూరులో గడప గడపకు ఘన స్వాగతం – ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోందని, గ్రామాల్లో ప్రతి ఇంటా ఘన స్వాగతం పలుకుతున్నారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని చెర్లోపల్లె, బోయపల్లె, గొల్లపల్లె, తిమ్మికృష్ణాపురం గ్రామాల్లో సమస్యలను ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, సర్పంచ్‌ మునెమ్మ తో కలసి ఇంటింటికి వెళ్లారు.జగనన్న సంక్షేమబావుట పుస్తకాలను పంపిణీ చేసి, సంక్షేమ పథకాలు అందించిన వివరాలను తెలియజేశారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామీణ సమస్యలు సకాలంలో పరిష్కారమౌతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్టీ మండల అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ శివ, నాయకులు నారాయణరెడ్డి, బాలచంద్రారెడ్డి, వెంకటరెడ్డి, చంద్రారెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: A warm welcome to Gadapa Gadapa in Punganur – MPP Akkisani Bhaskar Reddy

Leave A Reply

Your email address will not be published.