Natyam ad

అభివృద్ధిలో ఏపీ దూకుడు..రెండంకెల వృద్ధిలో టాప్

తాడేపల్లి ముచ్చట్లు:

 

దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 2021-22లో దేశంలోనే రెండంకెల వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ నివేదిక విడుదల చేసింది. 2021-22లో దేశ జీడీపీ వృద్ధిరేటు 8.7 శాతం కాగా.. ఏపీ వృద్ధిరేటు ఏకంగా 11.43 శాతం కావడం విశేషం. వరుసగా మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలుస్తోంది.*

ఏడు నెలల్లో రూ.40,361 కోట్ల పెట్టుబ‌డులు

Post Midle

2022 జనవరి నుంచి జూలై వరకు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. 2022లో మొదటి ఏడు నెలల్లో దేశ వ్యాప్తంగా రూ.1,71,285 కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తే.. ఒక్క ఏపీలోనే రూ.40,361 కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి. 2021-22లో స్థూల రాష్ట్ర ఉత్పత్తి (GSDP) వృద్ధిరేటులో ఏపీనే నెంబర్‌ వన్‌గా నిలిచినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఏపీకి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు

పోర్ట్ ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధిలో రాష్ట్రం అత్యుత్తమంగా ఆవిర్భవించినందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డును కూడా గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఢిల్లీలో అవార్డును అందుకున్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వతల గ్రామంలో ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ ద్వారా రూ. 1,790 కోట్ల పెట్టుబడి పెట్టబడింది. ఈ ప్రాజెక్టుతో స్థానికులకు 1,045 ఉద్యోగాలను సృష్టిస్తుంది.

 

Tags: CM’s review of revenue departments.

Post Midle