పుంగనూరులో పారిశుద్ధ్యంపై కమిషనర్‌, చైర్మన్‌ పర్యటన

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు మెరుగుపరిచేందుకు కమిషనర్‌ నరసింహప్రసాద్‌, చైర్మన్‌ అలీమ్‌బాషా కలసి పర్యటించారు. బుధవారం కొత్తపేట ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాలను సందర్శించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలాగే కౌన్సిలర్లు అమ్ము, పూలత్యాగరాజు, రేష్మా లు ఇంటింటి చెత్తసేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. వీధుల్లో చెత్త నిల్వలేకుండ తరలించే కార్యక్రమం చేపట్టారు. చైర్మన్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఒకొక్కరోజు ఒకొక్క వార్డును సందర్శించి, పారిశుద్ధ్యం, మంచినీటి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామన్నారు. ఈ విషయమై ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో చర్చించారు. వీటితో పాటు గడప గడపకు కార్యక్రమాన్ని కూడ నిర్వహిస్తామన్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తరలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ చేస్తామన్నారు. పట్టణ ప్రజలకు మున్సిపాలిటి ద్వారా మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఈయన వెంట సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొన్నారు.

Tags: Commissioner and Chairman’s visit to Punganur on Sanitation

Leave A Reply

Your email address will not be published.