Natyam ad

అభివృద్ధి , సంక్షేమం రెండు కళ్లు

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల్లులాగా ఆదర్శంగా పరిపాలన సాగిస్తున్నారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి కొనియాడారు. బుధవారం మండలంలోని పాలె ంపల్లె గ్రామంలో వైఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేశారు. మానమ్మకం నువ్వే జగన్‌ బుక్‌లెట్లను పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన పేదలందరికి నవరత్న పథకాలను అందించామన్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు, నీరు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించామన్నారు. ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సులను నడుపుతున్నామన్నారు. ఇంటింటికి కొళాయిలు వేసే కార్యక్రమం చేపట్టామన్నారు. అలాగే పల్లెల్లో పరిశ్రమలను నెలకొల్పేందుకు త్రిఫేజ్‌ కరెంట్‌ను పంపిణీ చేసే కార్యక్రమం పనులు చురుగ్గా జరుగుతున్నట్లు తెలిపారు. 30ఏళ్లుగా జరిగని అభివృద్ధి నాలుగన్నరేళ్లలో చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలందరు తిరిగి సీఎంగా జగనన్ను ఎన్నుకునేందుకు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, పార్టీ నాయకులు కుమార్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, బాబ్‌జాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

మున్సిపాలిటిలో…

మున్సిపాలిటిలోని నానబాలవీధి సచివాలయంలో వైఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్‌ బోర్డును ఆవిష్కరించారు. పార్టీ జెండాను ఎగురవేసి , బుక్‌లెట్లను పంపిణీ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, లలిత, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, కౌన్సిలర్లు కిజర్‌ఖాన్‌, అర్షద్‌అలీ, సాజిదాబేగం, రేష్మా, భారతి, పార్టీ నాయకులు రాజేష్‌, ఇర్ఫాన్‌, సురేష్‌, అమ్ముకుట్టి, అస్లాంమురాధి, నూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Development and welfare are two eyes

 

Post Midle