Natyam ad

బాబు పాలనలో కాపుల ఊసేలేదు…- అడపశేషు

పుంగనూరు ముచ్చట్లు:

పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు కాపులను అభివృద్ధి చేయలేదని రాష్ట్ర కాపుకార్పోరేషన్‌ చైర్మన్‌ అడపశేషు తెలిపారు. ఆదివారం ఆయన పుంగనూరులో శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి , ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి , కాపు కార్పోరేషన్‌ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలను, మంత్రులను నియమించి, ఎన్నో పదవులు కట్టబెట్టారన్నారు. వంగవీటి మోహన్‌రంగ, ముద్రగడపద్మనాభంను హింసించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. కాపు సోదరులను వేదించడం, కేసులను పెట్టడం చంద్రబాబు ఘనకార్యాలని ఎద్దెవా చేశారు. ఆకేసులను రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిదేనని కొనియాడారు. చంద్రబాబు మాటలు నమ్మరాదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామిలు నేరవేర్చలేదన్నారు. రాబోవు రోజులు దుర్మార్గమైన రోజులని, బాబు మాయమాటలను కాపులు నమ్మరాదని, కాపులు ప్రతి ఒక్కరు జగనన్న మాటలను నమ్మి , ఆయనను ఆదరించాలన్నారు. జగనన్నను రెండవ సారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేయాలని కోరారు.

Post Midle

అడిగితే చాలు…మంత్రి పెద్దిరెడ్డి అండ….

ఎక్కడివారైన సహాయం కోరి వస్తే వారికి అండగా నిలవడం మంత్రి పెద్దిరెడ్డి కుటుంభానికి అలవాటని చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డెప్ప అన్నారు. ఆదివారం పట్టణ సమీపంలోని భీమగానిపల్లె వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. అక్కడ జరిగిన సభలో ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ ఎన్నో ప్రాంతాల వారు తమ కులస్తులకు చెందిన విగ్రహాల ఏర్పాటుకు, కమ్యూనిటి భవనాలకు నిధులు కోరితే సొంత నిధులను మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం కేటాయిస్తోందని ఆయన కొనియాడారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహా ఏర్పాటుకు కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఇవ్వడం ఆయన ఔదార్యానికి నిదర్శనమన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసిందని కొనియాడారు.

– ఎంపీ రెడ్డెప్ప

మోసాలకు కేరాఫ్‌ చంద్రబాబు

చంద్రబాబునాయుడు ప్రతి ఒక్కరిని మోసగించడం లక్ష్యంగా రాజకీయాలు చేస్తారని చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ఎద్దెవా చేశారు. ఆదివారం పుంగనూరులో శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తనకు చిత్తూరు ఎమ్మెల్యే టికెట్టు ఇస్తానని రెండుసార్లు మోసగించారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావంలో రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు తనకు టికెట్టు ఇచ్చి గెలిపించారన్నారు. బలిజల అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ఎంతగానో కృషి చేస్తోందని కొనియాడారు. బలిజలను మభ్యపెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు మోసపోవద్దని, ప్రతి ఒక్కరు వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేయాలని సూచించారు.

– ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు

కాపుల రుణం తీర్చుకోలేం….

బలిజకులస్తులు ఐకమత్యంగా తమ కటుంభానికి అండగా నిలిచారని, వారి రుణం తీర్చుకోలేమని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తెలిపారు. ఆదివారం శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి బలంగా ఉన్న కాపుల ఓట్లను చీల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని అలాంటి వారికి తగిన గుణపాఠం నేర్పాలన్నారు. పెద్దిరెడ్డి కుటుంభానికి అండగా ఉన్న కాపుల అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.

– ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

 

పవనకళ్యాణ్‌ మనకు పనికిరాడు…

జనసేన పార్టీ నాయకుడు పవన్‌కళ్యాణ్‌ కాపులకు , సామాన్య ప్రజానికానికి పనికిరాడని టీటీడీ మాజీ మెంబరు పోకల అశోక్‌కుమార్‌ స్పష్టం చేశారు. తనకు చిరంజీవి కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఎవరు కానీ వారి కుటుంబం ద్వారా లబ్ధిపొందిన కాపులు ఉన్నారా..?అంటు ప్రశ్నించారు. ఆకుటుంబం కాపులతో లబ్ధిపొందుతారని , కాపులకు ఒరగబెట్టేది లేదన్నారు. పవన్‌కళ్యాణ్‌ ఎన్ని మాటలు చెప్పిన కాపులు నమ్మరాదని సూచించారు. మంత్రి పెద్దిరెడ్డి 30 సంవత్సరాల ముందు సోమల ఎంపీపీ రామచంద్రయ్యను ఎన్నుకుని కాపులకు అధికప్రాధాన్యత కల్పించారని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో కాపులు ఐకమత్యంగా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసి, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని రెండవసారి గెలిపించుకోవాలని కోరారు.

– టీటీడీ మాజీ మెంబరు పోకల అశోక్‌కుమార్‌.

 

 

Tags; During Babu’s rule, the guard did not budge…- Adapaseshu

Post Midle