పుంగనూరులో సీఎం చిత్రపటాని పాలాభిషేకం
పుంగనూరు ముచ్చట్లు:
దళితుల స్మశాన వాటికలకు స్థలం కేటాయించి, వాటి అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ దళిత నేతలు ఎం.శంకరప్ప , రాజు, కృష్ణప్ప ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి, మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గురువారం పట్టణంలోని దళిత నాయకులు కలసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరప్ప మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు అన్ని విధాలుగా అండగా ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పుంగనూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరె డ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దళిత స్మశాన వాటికల దురాక్రమణలను తొలగించి , వాటికి కంచె ఏర్పాటు చేసి, అవసరమైన నీరు, కరెంటు ఇవ్వడం జరిగిందని కొనియాడారు. దళితులు ప్రతి ఒక్కరు వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి అండగా ఉండాలని , సీఎం వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి రెండవ సారి ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగాధరం, గంగప్ప, వెంకట్రమణ, రామ్మూర్తి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags: Palabhishekam of CM Chitrapatani in Punganur
