Natyam ad

పుంగనూరులో ఇంధన పొదుపులో ఉద్యోగులకు బహుమతులు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు డిపో బస్సులలో ఇంధన పొదుపు చేసిన ఆర్టీసి డ్రైవర్లకు బహుమతులు పంపిణీ చేశారు. శనివారం డిపో మేనేజర్‌ సుధాకరయ్య , ఆర్టీసీ మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి కలసి డ్రైవర్లు సలీం, నామశివయ్య , రెడ్డెప్ప, కండెక్టర్‌ పార్వతమ్మలకు ఒకొక్కరికి రూ.500లు చొప్పున బహుమతులు అందజేశారు. డిఎం మాట్లాడుతూ డిపోలో వీరు ఇంధనపొదుపును చేపట్టి, ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రతి ఒక్కరు ఇలాంటి పొదుపు కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ సంధ్య, ఆర్టీసి నాయకుడు కరీముల్లా, సిబ్బంది పాల్గొన్నారు.

Post Midle

Tags: Rewards for employees in energy saving in Punganur

Post Midle