పుంగనూరు నుంచి తిరుమలకు ఆర్టీసి బస్సులు
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు నుంచి తిరుమలకు రెండు ఆర్టీసి బస్సులను శనివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషాతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి బస్సులకు పూజలు చేసి, జెండా ఊపి ప్రారంభించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంగా రాగానే రాష్ట్ర అటవీశాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిపోను ప్రారంభించారని తెలిపారు. పుంగనూరు నుంచి అన్ని ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తిరుమలకు ప్రతి రోజు రెండు బస్సులను ఉదయం, సాయంత్రం నడుపుతున్నట్లు తెలిపారు. తిరుమల భక్తులు ఆర్టీసి బస్సులను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, కమిషనర్ నరసింహప్రసాద్, ఆర్టీసి డిపో మేనేజర్ సుధాకరయ్య, వైఎస్సార్ ఆర్టీసి మజ్ధూర్ సంఘ అధ్యక్షుడు జయరామిరెడ్డి, ఆర్టీసి కార్మిక సంఘ నాయకుడు కరీముల్లా, వైఎస్సార్సీపీ నాయకులు చంద్ర, గిరిప్రసాద్, మల్లి తదితరులు పాల్గొన్నారు.
Tags: RTC buses from Punganur to Tirumala