Natyam ad

పుంగనూరులో మధ్యం అక్రమ వ్యాపారులను ఆణచివేస్తాం- ఏఈఎస్‌ ఐయేషాబేగం వెల్లడి

– రూ.19 లక్షలు విలువ చేసే మధ్యం ధ్వంసం

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

మధ్యం అక్రమ వ్యాపారులను పూర్తి స్థాయిలో అణచివేస్తామని ఎస్‌ఈబి అదనపు సూపరింటెండెంట్‌ ఐయేషాబేగం వెల్లడించారు. శనివారం పుంగనూరు మండలంలోని నల్లగుట్లపల్లె వద్ద వివిధ రకాల కేసుల్లో సీజ్‌ చేసిన రూ.19 లక్షలు విలువ చేసే మధ్యంను సెబ్‌ సీఐ సీతారామిరెడ్డితో కలసి రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుంగనూరు కర్నాటక సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ వ్యాపారులకు అవకాశం లేకుండ తనిఖీలు తీవ్రం చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేక చర్యలు ఎవరు చేపట్టిన సహించేది లేదన్నారు. సెబ్‌ సిబ్బంది కూడ ఎలాంటి అక్రమాలకు తావులేకుండ పని చేయాలన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడినా, నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

Tags: We will crack down on illegal traders in Punganur – AES Ayeshabegum reveals

Post Midle