పుంగనూరులో మినిస్టేడియంకు స్థలాలు పరిశీలన
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలో మిని స్టేడియం నిర్మించేందుకు స్థలం పరిశీలన కార్యక్రమాన్ని స్టూరిజం రీజనల్ డైరెక్టర్ మురళికృష్ణ పరిశీలించారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణంతో కలసి ఎన్‌ఎస్.పేటలోని డిగ్రీకళాశాల మైదానాన్ని పరిశీలించారు. అలాగే స్థానిక బిఎంఎస్‌క్లబ్ మైదానాన్ని పరిశీలించారు. నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మిని స్టేడియం నిర్మించడం జరుగుతుందన్నారు. కబడ్డీ, వాలీబాల్ , జాతీయ క్రీడాకారులు ఉన్న పుంగనూరులో స్టేడియం నిర్మించాలని మంత్రిని కోరామన్నారు. దీనిపై మంత్రి స్పందించి స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపట్టారని తెలిపారు. స్థలం ఎంపిక కాగానే స్టేడియం నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈఈ మహేష్, కౌన్సిలర్లు అమ్ము, నరసింహులు, వైఎస్సార్‌సీపీ నాయకులు గణేష్, రాజేష్, అస్లాం, సూరి తదితరులు పాల్గొన్నారు.

Tags: Scrutiny of sites for Ministadium in Punganur
