బాలుడు రోహిత్ కి అస్వస్థత.
పుత్తూరు ముచ్చట్లు:
పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మందు మార్చి ఇవ్వడంతో రోహిత్ అనే 5 ఏళ్ల బాలుడికి అస్వస్థత. పుత్తూరులో నివాసం ఉంటున్న రాజకుమార్ తన 5 ఏళ్ల కుమారుడు రోహిత్ గత వారం రోజులుగా దగ్గు ఉందని, వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ పరీక్షించి సిరప్ వాడమని చీటీ రాసిచ్చారు. Farmasist బదులు ఆసుపత్రి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నా వసంత్ అనే వ్యక్తి పుండ్లు కు వాడే లోషన్ను ఇవ్వడంతో పిల్లవాడు దాన్ని తాగి అస్వస్థతకు గురయ్యాడు. మళ్ళీ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు సెలైన్ పెట్టి, పర్యవేక్షిస్తున్నరు.

Tags: The boy Rohit is unwell.
