పుంగనూరులో ప్రభుత్వం ఇస్తున్న వాహనాలను వినియోగించుకోవాలి-ఏడి లక్ష్మానాయక్
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామీణ ప్రాంత రైతులు పంటలు పండించుకునేందుకునే ప్రభుత్వం ఇస్తున్న హైరింగ్ వ్యవసాయ యంత్రాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఏడి లక్ష్మానాయక్ సూఛించారు. బుధవారం డివిజన్ పరిధిలోని 6 మండలాలకు చెందిన బాడుగ యంత్రాల గ్రూపు సభ్యులకు అవగాహన సదస్సు పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడి మాట్లాడుతూ ఆర్‌బికె పరిధిలో సెంటర్లు ఏర్పాటు చేసి, ట్రాక్టర్లు, పవర్‌టిల్లర్లు, రోటావెటర్లు తదితర యంత్రాలను అందుబాటులో ఉంచి , సరసమైన ధరలకు , బాడుగలకు పంపేలా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. అలాగే యంత్రాల పనివిధానాన్ని వివరించారు. వీటిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవడంతో కూలీల సంఖ్య తగ్గడంతో పాటు పనులను త్వరిత గతిన పూర్తి చేసేందుకు వీలుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో పాటు ఏవోలు సంధ్య, సుధాకర్, మోహన్, కుమార్, జ్యోతమ్మ, రాఖిబా, హేమలత, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Use the vehicles provided by the government in Punganur – Adi Lakshmanayak