Natyam ad

పుంగనూరులో డిజిటల్‌ గ్రంధాలయం ఏర్పాటు చేస్తాం – చైర్మన్‌ మధుబాల

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో డిజిటల్‌ గ్రంధాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని జిల్లా గ్రంధాలయ చైర్మన్‌ మధుబాల తెలిపారు. శనివారం గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా పట్టణంలోని గ్రంధాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సరస్వతిదేవికి పూజలు చేశారు. స్థానిక అధికారి సోమశేఖర్‌, వైఎస్సార్‌సీపీ నాయకుడు జయరామిరెడ్డి, విద్యార్థులతో కలసి ఆమె వారోత్సవాలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ అనేక మార్పులు చేస్తున్నారని కొనియాడారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన దిశ చట్టాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. అలాగే డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు రాచబాట వేస్తామన్నారు. వారోత్సవాలలో పాల్గొన్నవారికి బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు వెంకటపతి, రామలింగప్ప. సీతాపతిరాజు, గంగులమ్మ, ఉర్ధూగ్రంధాలయాధికారి నసీబ్‌జాన్‌ , రచయిత హాసినాబేగం పాల్గొన్నారు.

Post Midle

Tags: We will set up a digital library in Punganur – Chairman Madhubala

Post Midle