పుంగనూరులో మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవార్లు
పుంగనూరు ముచ్చట్లు:
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం మూడవ రోజు పలు ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇన్‌స్పెక్టర్ మునీంద్రబాబు ఆధ్వర్యంలో శ్రీ అష్టలక్ష్మీ అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి , పూజలు నిర్వహించారు. అలాగే శ్రీబోగనంజుండే శ్వరస్వామి ఆలయంలో పార్వతిదేవిని వివిధ పుష్పాలతో , పట్టుచీరలు కట్టి మహాలక్ష్మీ అలంకారం చేశారు. శ్రీవిరూపాక్షి మారెమ్మ ఆలయంలో అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీచాముండేశ్వరి ఆలయంలో అమ్మవారిని, శ్రీవాసవికన్యకాపరమేశ్వరిదేవిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. ఆలయాల్లో హ్గమాలు నిర్వహించి, అభిషేకాలు చేసి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Ammavars in Punganur in Mahalakshmi Alankaram
