Natyam ad

పోలీసులపై దాడులు చేసిన చల్లాకు ఎమ్మెల్యే టికెట్టు ఇచ్చిన బాబు 

– రౌడీయిజం, మోసం చేయడం ఆపార్టీవారిదే

– దాడుల్లో 50 మంది పోలీసులు గాయపడ్డారు

-నేను సోనియాకే కాళ్లే వెహోక్కలేదు

Post Midle

– సాయిబాబా సంపద దోచుకోలేదా

– కిరణ్‌పై  మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌

 

పుంగనూరు ముచ్చట్లు:

ప్రశాంతతకు మారు పేరైన పుంగనూరు చరిత్రలో రక్త చరిత్రను సృష్టించి , 50 మంది పోలీసులను తీవ్రంగా గాయపరచి , కాళ్లు , కళ్ళు, చేతులు తెగిపోయేలా దాడుల సృష్టికర్త తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి . అలాంటి వ్యక్తికి చంద్రబాబు టికెట్టు ఇచ్చి రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నాడు. వెన్నుపోట్లు, మోసాలు చేయడం తెలుగుదేశం పార్టీ వారికి వెన్నతో పెట్టిన విద్యలే… అంటు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరె డ్డి రామచంద్రారెడ్డి విరుచుకు పడ్డారు. శుక్రవారం వేలాది మందితో కలసి ఎమ్మెల్యే పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. ర్యాలీలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.  గోకుల్‌ సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో పెద్దిరెడ్డి ప్రసంగించారు. అలాగే ఆర్యవైశ్య ఆత్మీయ సభలో ప్రసంగించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ  గత ఏడాది ఆగస్టు 4న చంద్రబాబు పర్యటనకు సంబంధించి బైపాస్‌ రోడ్డులో అనుమతి పొంది , దురుద్ధేశంతో కావాలనే అల్లర్లు సృష్టించేందుకు చల్లా రామచంద్రారెడ్డి రోడ్డు మ్యాప్‌ మార్చి పట్టణంలోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, పోలీసులు అనుమతి లేదని అడ్డుకోవడంతో కట్టెలు, రాళ్లు, రాడ్లు, బాటిళ్లతో దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 50 మంది పోలీసులు గాయపడ్డారు. బిహార్‌, యూపి తరహాలో ఏపిలో పోలీసులపై దాడులు చేసిన ఘనత, చరిత్ర తెలుగుదేశం అభ్యర్థిదేనని ఎద్దెవా చేశారు. అలాంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి , జైలుకు పంపకుండ ఉంటారా….అని ప్రశ్నించారు. దీనికి కూడ మంత్రి పెద్దిరెడ్డి కారణమని చల్లా విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి వ్యక్తులకు అధికారాన్ని అప్పగిస్తే పుంగనూరులో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. హిందూముస్లిం సోదరులకు రక్షణ కరువుతుందని , ఇలాంటి వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము,  ఆర్యవైశ్య సంఘ నాయకులు బాలసుబ్రమణ్యం , ముల్లంగి విజయకుమార్‌, పిఎల్‌.ప్రసాద్‌, నాగరాజ, పిఎల్‌.శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

బాబు మోసాలు…

 

2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడ నేరవేర్చలేదని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకున్న ఘనత చంద్రబాబు, కిరణ్‌లదేనన్నారు. 30 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని 5 ఏళ్లలో చేశామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

 

 

సోనియా కాళ్లే పట్టలేదు…

 

కాంగ్రెస్‌ పార్టీలో ఉండి, సోనియా గాంధి కాళ్లే పట్టుకోలేదు. అలాంటిది నీచుడు , ద్రోహి అయిన కిరణ్‌తో సానిత్యమా..? నాకు కిరణ్‌ ఎప్పుడు శత్రువే. చిదంబరం కాళ్లు పట్టుకుని ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కిరణ్‌ జగన్‌ను జైలుకు పంపాడు. పుట్టపర్తి సాయిబాబా చనిపోతే పది రోజుల పాటు శవాన్ని ఉంచి సంపద దోచుకున్నది కిరణ్‌ అంటు పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఏపి ప్రజలను మోసగించి , రాష్ట్రాన్ని ముక్కలు చేసి నేడు స్వార్థం కోసం బిజెపి ముసుగులో ఎంపీ టికెట్టు తెచ్చుకునేందుకు కిరణ్‌కు సిగ్గుండాలని ఎద్దెవ చేశారు. సమైఖ్యాంధ్ర పార్టీ పెట్టి మెడలో చెప్పులు వేసుకుని తిరిగిన ద్రోహి కిరణ్‌ అని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డికి అత్యధిక మెజార్టీ ఓట్లు వేసి, కిరణ్‌ను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.

 

Tags: Babu gave MLA ticket to Challa who attacked the police

Post Midle