Natyam ad

వేలాది మందితో కలసి పెద్దిరెడ్డి నామినేషన్‌ దాఖలు

– కుటుంబ సమేతంగా ఆంజనేయస్వామికి పూజలు
– పట్టణంలో భారీ ర్యాలీ

 

పుంగనూరు ముచ్చట్లు:

 

Post Midle

పుంగనూరు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన భార్య స్వర్ణమ్మ , కుమారై శ్రీశక్తితో కలసి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలను ఆర్‌వో మధుసూదన్‌రెడ్డికి అందజేశారు. ఆయన పెద్దిరెడ్డి చే ప్రమాణం చేయించి నామినేషన్‌ పత్రాలను స్వీకరించారు. తొలుత మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేసి ఆశీర్వాదం పొందారు. అక్కడి నుంచి ఆర్‌వో కేంద్రం వరకు వేలాది మంది అభిమానులతో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి , ఎమ్మెల్సీ భరత్‌ తో కలసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ కొనసాగించారు. గోకుల్‌ సర్కిల్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీటీడీ బోర్డు మాజీ మెంబరు పోకల అశోక్‌కుమార్‌, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, రెడ్డెప్ప, విరూపాక్షి జయచంద్రారెడ్డి, ప్రుద్వీధర్‌రెడ్డి, సుబ్రమణ్య యాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, పార్టీ అధ్యక్షులు జయరాం, కొత్తపల్లె చెంగారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శులు దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, జయరామిరెడ్డి తో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పిటిసిలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు వేలాది మంది పాల్గొన్నారు.

ర్యాలీ ఇలా…

ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచర్‌ లారీలో హనుమంతరాయునిదిన్నె నుంచి ర్యాలీ ప్రారంభించారు. చెరువు కట్టపై గల దర్గాలో చాదర్‌ సమర్పించి ప్రార్థనలు జరిపారు. ర్యాలీలో వైఎస్సార్‌సీపీ జెండాలు, డిజె పాటలు, డ్రమ్ములు, షీకారిలు , లంబాడీల నృత్యాలతో ర్యాలీ ఉత్తేజభరితమై కొనసాగింది. ర్యాలీ ఉద యం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. ర్యాలీ రామసముద్రం రోడ్డు, ఎన్‌ఎస్‌.పేట, పుంగమ్మ చెరువు కట్టమీదుగా బ్రాహ్మణవీధి, నాగపాళ్యెం, ఇందిరాసర్కిల్‌, ఎంబిటి రోడ్డు, గోకుల్‌ సర్కిల్‌ వరకు నిర్వహించారు. ర్యాలీలో మంత్రి పెద్దిరెడ్డి వేలాది మందికి అభివాదం చేస్తూ పలకరిస్తూ కొనసాగించారు.

క్రైన్లతో గజమాలలు…

ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథరెడ్డిలకు అభిమానులు రెండు క్రైన్లు ఏర్పాటు చేసి ఒక క్రైన్‌లో తులసి గజమాల వేసి సన్మానించారు. అలాగే మరో క్రైన్‌తో పండ్లు, పూలు, గజమాలగా కట్టి పెద్దిరెడ్డి, ద్వాకరనాథరెడ్డి లను సన్మానించారు.

108, ఫైర్‌ ఇంజన్‌కు క్లియరెన్స్ …

ర్యాలీ జరుగుతున్న సమయంలో ఎన్‌ఎస్‌.పేట వద్ద 108 వాహనం వచ్చింది. వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు మైకులో హెచ్చరించి, ర్యాలీని ఆపి వాహనానికి క్లియరెన్స్ ఇచ్చారు. అలాగే అగ్నిమాపక యంత్రం రావడంతో దానికి కూడ క్లియరెన్స్ ఇచ్చి ర్యాలీని కొనసాగించారు.

     

Tags; Peddireddy filed nomination along with thousands of others

Post Midle