పుంగనూరులో బిజెపి సంబరాలు
పుంగనూరు ముచ్చట్లు:
గుజరాత్ ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం సాధించడంతో స్థానిక నేతలు పట్టణంలో సంబరాలు చేసుకున్నారు. గురువారం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాజారెడ్డి, జిల్లా కమిటి మెంబరు రాజాజెట్టి ఆధ్వర్యంలో బాణసంచాపేల్చి , మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరిపారు. రాజారెడ్డి మాట్లాడుతూ రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో విజయఢంకా మ్రోగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గణేష్ , శ్రీనివాసులు, నానబాలకుమార్, మల్లికారాణి, బాబు, తదితరులు పాల్గొన్నారు.

Tags: BJP celebrations in Punganur
