పుంగనూరులో నూతన పెన్షన్లతో పండుగ – పెద్దిరెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
అర్హులైన పేదలందరికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు శ్రావణమాస్ర పండుగ చేసుకున్నారు. మంగళవారం రాష్ట్ర వైఎస్సార్‌సీపీ కార్యదర్శి పెద్దిరెడ్డి , ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ కలసి మండలంలోని 23 పంచాయతీల్లో 293 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. అలాగే మున్సిపాలిటిలోని 31 వార్డుల్లోని పేదలకు 173 పెన్షన్లు మంజూరైంది. 9వ సచివాలయంలో కౌన్సిలర్లు త్యాగరాజు, అర్షద్‌అలి కలసి పెన్షన్లు పంపిణీ చేశారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. అర్హులైన పేదలందరికి కులమతాలకతీతంగా పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వందేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీపతి, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిడ్డి, మంగళం రాజారెడ్డి , రామకృష్ణారెడ్డి , చంద్రారెడ్డి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Festival with new pensions in Punganur – Peddireddy
