మధ్యం మత్తులో యువకుడి హత్య -సీఐ రాఘవరెడ్డి వెల్లడి
-ఇద్దరు నిందితులు అరెస్ట్
పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలో ఆర్టీసి బస్టాండులో గత నెల 20న మహరాష్ట్రకు చెందిన సంజయ్‌మోహిత్(25) ను మధ్యం మత్తులో హత్య చేసినట్లు సీఐ రాఘవరెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మహరాష్ట్రకు చెందిన సంజయ్‌మోహిత్ మండలంలోని చదళ్ల గ్రామంలో కూలీ పనులు చేస్తున్నాడు. ఇలా ఉండగా సంజయ్‌మోహిత్ మధ్యం సేవించి భార్యతో గొడవ పడి వచ్చి స్థానిక ఆర్టీసి బస్టాండులో ఉండగా అదే సమయంలో పట్టణంలోని కొత్తయిండ్లుకు చెందిన బాబు, రామసముద్రం మండలం గోసువారిపల్లెకు చెందిన నారాయణరెడ్డి పనులకు వెళ్లి బస్టాండ్‌కు రాత్రి చేరుకున్నారని సీఐ తెలిపారు. ఈ సమయంలో సంజయ్‌మోహిత్ తాగి నారాయణరెడ్డి, బాబుతో గొడవ పడటంతో వీరిరువురు కలసి అతనిని చీరతో కట్టి, బస్టాండ్‌లో బెంచీలపై పడుకోబెట్టి, వైర్లతో కట్టి గొంతునులిమి హత్య చేశారని తెలిపారు. ఇలా ఉండగా పుంగనూరుకు వచ్చిన సంజయ్‌మోహిత్ హత్యపై క్లూ లభించకపోవడంతో పలమనేరు డిఎస్పీ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పకడ్భంధిగా దర్యాప్తుచేసి నిందితులను పట్టుకున్నామన్నారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి , రిమాండ్‌కు తరలించామన్నారు.
Tags: Murder of a young man while intoxicated – CI Raghavareddy revealed
