Natyam ad

సచివాలయాలతో ప్రజల ముంగిటకు సేవలు -మంత్రి పెద్దిరెడ్డి

-ఆర్‌బికె, వెల్‌నెస్‌ సెంటర్లు ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకు అన్ని రకాల సేవలు అందించడం జరుగుతోందని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి మండలంలోని మేలుందొడ్డిలో సచివాలయం, ఆర్‌బిజె, వెల్‌నెస్‌ సెంటర్లను సుమారు రూ.80 లక్షలతో నిర్మించారు. వాటిని మంత్రి ప్రారంభించారు. అలాగే మండలంలోని చదళ్ల వద్ద 8.23 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఆటోనగర్‌కు మంత్రి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ సచివాలయాలు , వలంటీర్ల ద్వారా ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తున్నామన్నారు. ఏ చిన్న పనికావాలన్న వలంటీర్లు ఇంటి వద్దకే రావడంతో ప్రజలకు ఆర్థిక , మానసిక కష్టాలు తప్పిందని కొనియాడారు. ఈ సమావేశంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము తదితరులు పాల్గొన్నారు.

350 మందికి ఆటోనగర్‌…

పట్టణ సమీపంలోని చదళ్ల వద్ద 8.23 ఎకరాల్లోఏర్పాటు చేస్తున్న ఆటోనగర్‌లో 350 కుటుంభాలకు స్థలాలు కేటాయిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆటో కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆటోనగర్‌ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆటోనగర్‌ అభివృద్ధి కోసం అన్ని రకాల సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆటోనగర్‌ సంఘ నాయకులు దుర్గారాజారెడ్డి, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

18 మంది ఆదివాసిలకు ఇండ్ల పట్టాలు…

పుంగనూరు, పలమనేరు సరిహద్దుల్లో ఉన్న మాదవరం సమీపంలోని కుయ్యవంక అటవీప్రాంతంలో ఉన్న 18 కుటుంభాల ఆదివాసిలకు ఇండ్ల పట్టాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , డిఎఫ్‌వో చైతన్యకుమార్‌రెడ్డి , ఎంపీ రెడ్డెప్ప పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ 30 ఏళ్లుగా నిరాధరణకు గురైన ఆదివాసిలకు కాలనీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుత్‌, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. ఆదివాసిలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

 

Tags: Services to the public with secretariats – Minister Peddireddy

Post Midle