Natyam ad

రెండేళ్లలో ప్రతి గ్రామానికి సాగు తాగునీరివ్వడమే ప్రభుత్వ లక్ష్యం-ఎంపీ మిథున్‌రెడ్డి

-రూ:3 కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించిన ఎంపీ మిథున్‌రెడ్డి
– నాడు-నేడు ద్వారా పాఠశాలలు, ప్రభుత్వాసుపత్రులకు మహర్దశ
-బోయకొండను ఆదర్శంగా తీర్చిదిద్దాం
– హంద్రి నీవా ద్వారా చౌడేపల్లె, సోమలకు నీళ్లు వచ్చేలా చర్యలు
 
చౌడేపల్లె ముచ్చట్లు:

కరువుకు నిలయమైన పడమటి ప్రాంతాలు పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల ప్రాంతాల్లోని ప్రతి గ్రామానికి వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారాసాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరివ్వడమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ లక్ష్యమని రాజంపేట ఎంపీ, లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ పివి. మిథున్‌రెడ్డి అన్నారు. బుధవారం రూ:3 కోట్ల వ్యయంతో ఆదర్శవంతంగా నిర్మించిన మండల పరిపాలనా భవన సముదాయాన్ని ఎంపీలు మిథున్‌రెడ్డి, ఎన్‌. రెడ్డెప్ప, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్‌,జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అంతకు మునుపు జాతీయ జెండాను ఎగువ వేసి గౌరవందనం చేశారు. ఈ సంధర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ 2009 నుంచిమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీగా తనను అత్యధిక మెజార్టీతో గెలుపుకు కృషిచేసిన ఓటర్లు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏగ్రామంలోనే అభివృధ్ది జరిగిందా…?ఏ ఒకగ్రామానికైనా రోడ్డువేశారా…? బోయకొండకు వెళ్లి అందరూ దండం పెట్టి దోచుకొన్నారే కానీ ఏమి అభివృద్ది చేశారని ప్రశ్నించారు. కల్లుపల్లి నుంచి చౌడేపల్లెకు, చౌడేపల్లెనుంచి బోయకొండ మీదుగా మదనపల్లెకు సుమారు రూ:55 కోట్లతో డబుల్‌రోడ్డుపనులు మంజూరుచేయించి పనులు ప్రారంభించారన్నారు. అలాగే గ్రామాల్లో సిమెంటు రోడ్లు,పల్లెలకున్న లింకు రోడ్లు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి సీఎం వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బోయకొండలో చేపట్టిన అభివృద్ది ప్రజలు చూడాలని సూచించారు. మండలానికి బోయకొండ గుండెలాంటిదని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. తాగునీటి సమస్యలతో గతంలో మనం అనేక కష్టాలు పడ్డామని, పస్త్రుతం దేవుడి దయతో వర్షాలు పుష్కలంగా పడ్డాయన్నారు. వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా పక్క జిల్లాల నుంచి నీటిని •పైపులైన్ల ద్వారా పడమటి ప్రాంతాలకు సరఫరా చేసేలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేశారని, ఈ పథకం నిర్వహణకు క్యాబినేట్‌లో కూడా ఆమోదం చేశారన్నారు. పుంగ నూరు, చౌడేపల్లె, సోమల మండలం వరకు గాలేరు నుంచి హంద్రీ నివా జలాలను తెప్పించే పనులు మంజూరు చేశారని, త్వరలో పనుల ప్రారంభానికి టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు.చెరువుల నిండా పుష్కలంగా సాగునీరిచ్చి , పంటల పొలాలన్నీ పచ్చదనంతో నిండి రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని కొనియాడారు.శి•లావస్థలకు చేరువలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు,ప్రభుత్వాసుపత్రులను నాడు- నేడు ద్వారా ఆధునీకరించి ప్రజలకు సేవలందిస్తున్నామని, విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తు మంచి పాలన అందిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటీసీ దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తి, పాల ఏకరిల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్‌,ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఆర్టీసీనెల్లూరు రీజినల్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, బోయకొండ ఆలయ కమిటి చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ,ఏఐపీపీ మెంబరు అంజిబాబు, మాజీ ఎంపీపీలు వెంకటరమణరాజు, రెడ్డిప్రకాష్‌, రుక్మిణమ్మ, సింగిల్‌విండో చైర్మన్‌ రవిచంద్రారెడ్డి తదితరులున్నారు.

సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: The government’s goal is to provide drinking water to every village in two years – MP Mithunreddy